Kannappa Runtime Revealed: Prabhas to Appear for 30 Minutes – Fans Go Wild!
Kannappa Runtime Revealed: Prabhas to Appear for 30 Minutes – Fans Go Wild!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భవ్యంగా తెరకెక్కుతోంది. తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా మొత్తం 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్‌తో ఉండబోతోందని విష్ణు చెప్పారు. ఇందులో ప్రభాస్ పాత్ర 30 నిమిషాల పాటు ఉంటుందని, మోహన్‌లాల్ పాత్ర 15 నిమిషాలు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాలు తెలిసిన వెంటనే ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. “30 నిమిషాలు థియేటర్లో ప్రభాస్ రచ్చ రచ్చ” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ ఏ సినిమాలో కనిపించినా అది అభిమానులకి పండగే. ఇక కన్నప్ప వంటి భారీ ప్రాజెక్టులో మూడో భాగం సమయం పాటు కనిపించనున్నారని తెలిసిన తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇక మోహన్‌లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ 15 నిమిషాల సీన్స్‌తో అదరగొట్టబోతున్నారని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కూడా భాగమవుతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా విజువల్స్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. విడుదల తేదీకి ఇంకా నెల రోజులే ఉండటంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ వేగంగా కొనసాగుతున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *