కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈ గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతార ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఇప్పుడు రాబోతున్న ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంతార ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నాడు రిషబ్ శెట్టి.
కాగా ఈ సినిమాను అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగా అనగా ఈ రోజు పైడ్ ప్రీమియర్స్ వేయాలని భావించారు. అందుకు తగ్గట్టు బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. బుకింగ్స్ లో సైతం జోరు చూపించింది కాంతార చాఫ్టర్ 1. అయితే ఉన్నట్టుండి అన్ని పైడ్ ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. బుకింగ్స్ చేసుకున్న వారికి సైతం డబ్బులను తిరిగి ఇచ్చేసారు. ఇటు తెలుగు స్టేట్స్ లో కూడా నేడు ప్రీమియర్స్ ఉంటారయని ప్రకటించారు. కానీ ఇక్కడ ప్రీమియర్స్ ను రద్దు చేసారు, అయితే దీనికి గల కారణాలు ఏంటనేది తెలియలేదు. ఇక ఈ సినిమాకు ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది అక్కడ ప్రభుత్వం. కానీ నైజాంలో టికెట్స్ హైక్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను రిజెక్ట్ చేసింది. నైజాంలో రెగ్యులర్ రేట్లుతోనే రిలీజ్ కాబోతుంది కాంతర. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా ప్రీమియర్స్ రద్దయ్యాయి. ఐమాక్స్ స్క్రీన్స్ కంటెంట్ డిలే కారణంగా ఎర్లీ ప్రీమియర్స్ రద్దు అయ్యాయి.