Mon. Oct 13th, 2025
Rishab Shetty : కాంతార హిట్ రిషబ్ శెట్టి కెరీర్ కీలకం.. కారణం ఇదే

కేజీఎఫ్ సిరీస్, కాంతార సినిమాల తర్వాత శాండిల్ వుడ్ (Kannada Film Industry) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయిలో తన స్థానాన్ని బలపరచుకునే ప్రయత్నం చేస్తోంది. Think Big అనే కాన్సెప్ట్‌తో భారీ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న చిత్రం “కాంతార ప్రీక్వెల్ – చాప్టర్ వన్”. అక్టోబర్ 2న దసరా కానుకగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.

“కాంతార” సినిమాతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా రీజనల్ స్టార్ నుండి పాన్ ఇండియా హీరో-డైరెక్టర్‌గా ఎదిగాడు. 2022లో కేవలం రూ.13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా రూ.450 కోట్ల గ్రాస్ సాధించింది. అంతే కాదు, “కేజీఎఫ్ పార్ట్ 1” కలెక్షన్లను దాటి, శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. అప్పటికే “కేజీఎఫ్ 2” వెయ్యి కోట్ల మార్క్ దాటడంతో, “కాంతార” విజయం ఆ జోష్‌కి మరింత బూస్ట్ ఇచ్చింది.

ఇప్పుడు వస్తున్న “కాంతార చాప్టర్ వన్” పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి రూ.125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, రూ.500 కోట్ల మార్క్‌ను టార్గెట్ చేస్తోంది. రిషబ్ శెట్టి మరోసారి తన యాక్షన్, డైరెక్షన్ స్కిల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఫలితంపై శాండిల్ వుడ్ భవిష్యత్ ప్రాజెక్టులకే కాదు, రిషబ్ కెరీర్‌కి కూడా భారీ ఇంపాక్ట్ ఉండనుంది.

ఇక రిషబ్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లపై దృష్టి పెట్టాడు. తెలుగులో “జై హనుమాన్” తో పాటు నాగ వంశీ ప్రొడక్షన్‌లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్‌లో కూడా చత్రపతి శివాజీ బయోపిక్ తో అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు, తారక్-నీల్ ప్రాజెక్ట్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ అన్ని కమిట్‌మెంట్స్ మధ్య “కాంతార చాప్టర్ వన్” బ్లాక్‌బస్టర్ కావడం తప్పనిసరి అయింది.