Kanthara 1 :రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, అలాగే బెనిఫిట్ షో ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెరిగిన టికెట్ ధరలు వివరాలు ఈ మేరకు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: టికెట్ ధరపై అదనంగా రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరపై రూ. 100 వరకు అదనంగా పెంచుకోవడానికి అనుమతించింది.
READ MORE: Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ పోటీ.. కత్తిపోట్లతో దద్దరిల్లిన విశాఖ..
సినిమా విడుదల నేపథ్యంలో, ‘కాంతారా చాప్టర్ 1’ బెనిఫిట్ షో ప్రదర్శన కోసం ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రేపు (అక్టోబర్ 1, 2025) రాత్రి 10 గంటలకు ఈ బెనిఫిట్ షోను ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అనుమతులతో, ‘కాంతారా చాప్టర్ 1’ మేకర్స్‌కు, పంపిణీదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పెరిగిన ధరలు, బెనిఫిట్ షో ద్వారా సినిమా వసూళ్లకు మరింత దోహదపడనున్నాయి. రిషబ్ శెట్టి విశ్వరూపం మరోసారి చూడటానికి సిద్ధమవుతున్న అభిమానులకు ఈ నిర్ణయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో కొంతమంది తెలుగు అభిమానులు మాత్రం కోపంగా ఉన్నారు. కన్నడలో తెలుగు సినిమాలను, తెలుగు సినిమా నటులను అవమానిస్తుంటే ఎందుకు కన్నడ సినిమాలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.