హిట్ కి ఏకైక ఫార్ములా అదే – కరీనా కపూర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 9, 2024 11:32 AM IST

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్ కరీనా కపూర్ ‘బాక్సాఫీసు వద్ద హిట్‌ సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ‘సింగమ్‌ అగైన్‌’లో సీత తరహా పాత్రలో కనిపించి మెప్పించింది కరీనా. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమా బాక్సాఫీసు దగ్గర హిట్‌ కొట్టాలంటే.. కథ బాగుండాలి. హిట్ కి ఏకైక ఫార్ములా కథే. ఆ కథలో హిట్ మాయాజాలాన్ని సృష్టించగల సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది’ అంటూ కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.

ఇదే విషయం పై కరీనా కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఐతే, కథ ఎంపిక చాలా కష్టం. కానీ, కథ ఎంచుకునే ముందు.. ఆ కథలో శక్తిమంతమైన భావోద్వేగాలు, సీటు అంచున కూర్చోబెట్టే మలుపులు, మరపురాని సంగీతం ఇలా.. 2.30 గంటల్లో ఏదోకటి ప్రేక్షకుడి మనసును తాగే ఎలిమెంట్స్ కథలో ఉండేలా చూసుకోవాలి. ప్రతి సన్నివేశం తెరపై మ్యాజిక్‌ సృష్టించేలా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటేనే ఈ రోజుల్లో సినిమా హిట్ అవుతుంది’ అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *