అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కర్ణి సేన రంగంలోకి దిగింది. సినిమాలో ఫహద్ ఫాజిల్ పేరుకు సంబందించి కర్ణి సేన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పదాన్ని ‘పుష్ప 2’ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఒక వీడియో విడుదల చేసి ‘పుష్ప 2’ నిర్మాతలను బహిరంగంగా హెచ్చరించాడు. నిర్మాతలు ‘క్షత్రియ’ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘పుష్ప 2’ సినిమాలో ‘షెకావత్’ అనే పదాన్ని ఉపయోగించడంపై రాజ్ షెకావత్ మండిపడ్డారు. అలా చేయడం ద్వారా ఈ సినిమా ‘క్షత్రియ సమాజాన్ని ఘోరంగా అవమానించిందని’ వారు ఆరోపించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన షెకావత్‌ను విలన్ గా చూపించారని పేర్కొన్నారు.
Pushpa 2 : పుష్ప 2 స్టిల్స్ తో ఆప్- బీజేపీ పోస్టర్ వార్..
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సినీ పరిశ్రమ ఏళ్ల తరబడి క్షత్రియుల పరువు తీస్తూనే ఉందని ఆయన అన్నారు. “ చెవులు రిక్కించి వినండి, సినిమాలో ఈ క్రింది విధంగా ఉపయోగించిన ‘షెకావత్’ పదాన్ని తీసివేయాలి. లేకుంటే కర్ణి సేన కూడా దాడులు చేస్తుంది, ఇళ్లలోకి ప్రవేశిస్తుంది, అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది.” అని ఆయన హెచ్చరించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2’ చిత్రంలో, విలన్ పేరు భన్వర్ సింగ్ షెకావత్, అతని పాత్రను మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ పోషించారు. అతని పాత్ర నెగిటివ్‌గా చూపబడడంతో కర్ణి సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా నుంచి షెకావత్ ఇంటిపేరు తొలగించాలన్నది వారి డిమాండ్. ఇప్పుడు ఈ మొత్తం విషయంపై మేకర్స్ నుండి స్పందన ఇంకా రాలేదు. అయితే ఈ సినిమా డైరెక్షన్ టీంలో ఉన్న వీరేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి పేరుతోనే ఈ షెకావత్ పేరును సృష్టించామని సుకుమార్ తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.