హీరో కార్తికేయ గుమ్మకొండ ప్రస్తుతం తన 8వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ కంపెనీ యూవీ క్రియేషన్స్ వారి యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హ్యాపీడేస్ రాహుల్ టైసన్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.అజయ్ కుమార్ రాజు.పి. సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇవాళ ఈద్ పండుక విశెస్ చెబుతూ కార్తికేయ#8 సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రీ లుక్ లో స్టేడియం, బ్రిడ్జిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లను చూపించారు. ప్రీ లుక్ ప్రకారం ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందనే అనుకోవాలి. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.