Mon. Oct 13th, 2025
KATTALAN : అంటోని వర్గీస్ పెపే మాస్ అవతార్‌ “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న చిత్రం కాటాలన్. ఈ చిత్రంలో హీరోగా అంటోని వర్గీస్ పెపే నటిస్తున్నాడు.  యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.  అంటోని వర్గీస్ పెపే మాస్ అవాతర్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ, సిగరెట్‌తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్‌టెన్సిటీని సూచిస్తున్నాయి.

Additionally Learn : Andhra King Taluka Teaser : ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ “మార్కో” తర్వాత, కాటాలన్ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , షరీఫ్ మహమ్మద్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.  డెబ్యుటెంట్ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాండ్ పూజా కార్యక్రమాలలో ప్రారంభమైంది. పాన్-ఇండియా కాన్సెప్ట్‌గా భారీ స్థాయిలో నిర్మిస్తునారు. థాయ్‌లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్‌తో కలిసి రూపొందించారు. అదే సిరీస్‌లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది. సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్ , కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్ అందించారు. కట్టలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.