గత కొన్నాళ్లుగా వస్తున్న పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ హీరోయిన్ కీర్తిసురేశ్ ఇటీవలే తన చిరకాల మిత్రుడు ఆంథోని తటిల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సంప్రదాయంలో జరగ్గా.. ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. అయితే.. పెళ్లైన వారానికే సినిమా ప్రమోషన్స్‌లో జాయిన్ అయి హాట్ టాపిక్ అయింది కీర్తి. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటించింని బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి కారణంగా కీర్తి ఈ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది.
కానీ పెళ్లైనా వారానికే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. దీంతో పెళ్లి తర్వాత కూడా కీర్తి సినిమాలు చేస్తుందని అభిమానులు భావించారు. ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కీర్తి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు తప్పితే కొత్త ప్రాజెక్ట్స్‌కు నో చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేసింది కీర్తి. దీంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి సంసార జీవితానికే పరిమతమవాలని భావిస్తోందట. మామూలుగా అయితే ఈ మధ్య పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ, ఆలియా భట్ లాంటి ముద్దుగుమ్మల లాగే కీర్తి కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు కీర్తి సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా, లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.