టాలీవుడ్‌లోకి లక్ పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తోంది మరో కేరళ కుట్టీ. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఒక్క మూవీతో ఓవర్ నైట్ క్రష్ హీరోయిన్‌గా ఛేంజయ్యింది మాళవిక మనోజ్. ఫస్ట్ మూవీ ప్రకాశన్ పరాకట్టేతోనే యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. పేరుకు కేరళ కుట్టీ అయినప్పటికీ. తమిళ్ సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకుంది. జో మూవీలో ఆమె యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్ కుర్రకారు ఫ్లాట్. రియో రాజ్, మాళవిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాతో ఆమె పేరు మార్మోగిపోయింది.
2022లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అటు నుండి తమిళంలోకి ఇప్పుడు టాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకునేందుకు వస్తోంది మాళవిక మనోజ్. యంగ్ హీరో సుహాస్‌తో కలిసి ఓ భామ అయ్యో రామలో యాక్ట్ చేస్తోంది. రీసెంట్లీ ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నెక్ట్స్ ఇయర్ థియేటర్లలోకి రాబోతుంది ఈ భామ. రీసెంట్లీ ఆనంద్ శ్రీబాలా మూవీతో మాలీవుడ్‌ను పలకరించిన ఈ అమ్మడు. అక్కడ సుమతి వలవు అనే హారర్ ఫాంటసీ మూవీలో వర్క్ చేస్తోంది. “జో”తో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రియో రాజ్, మాళవిక మరోసారి జోడీ కడుతున్నారు. మరో లవ్ స్టోరీని ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు సుహాస్‌తో చేస్తున్న ‘ఓ భామ.. అయ్యో రామ’ కూడా లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ కేరళ కుట్టీకి సుహాస్ లక్కీ హ్యాండ్‌గా మారతాడా లేదో మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.