Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!

  • సంధ్య థియేటర్ ఘటన కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
  • బౌన్సర్ ఆంటోనీని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు..
  • తొక్కిసలాటకు ప్రధాన కారకుడు బౌన్సర్ ఆంటోనిగా గుర్తించిన పోలీసులు..
  • సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ఆంటోనీని సంధ్య థియేటర్ కు తీసుకురానున్న పోలీసులు..

Allu Arjun Bouncer Arrest: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు తొక్కిసలాటకు మూల కారణం అతడేనని వారు అనుమానిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు.

Read Also: AP Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలో భారీ వర్షాలు!

ఇక, తాజాగా, సోమవారం నాడు చిక్కడపల్లి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఇవాళ (డిసెంబర్ 24) విచారణకు వెళ్లారు. అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్ కుమార్, సీఐ రాజు ఆధ్వర్యంలో ఆయన అడ్వొకేట్ అశోక్‌ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగింది. దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ చేశారు. ఇప్పటికే ఎంక్వైరీ పూర్తి కావడంతో పోలీస్ స్టేషన్ లో పేపర్ వర్క్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ బయటకు రానున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *