• కూలీ తర్వాత జైలర్ 2 షూటింగుకు రజినీ
  • తమన్నాతో పాటు కేజీఎఫ్ భామను దించనున్న నెల్సన్
  • ఆచితూచి సినిమాలు చేస్తున్న శ్రీనిధి

Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. కొన్నాళ్లుగా రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడడం లేదు. అంతా రజినీ కాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడన్న కామెంట్స్ చేశారు. కానీ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ మాత్రం సూపర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది. మిడిల్ ఏజ్ లుక్కే అయినా రజినీ యాక్షన్ సీన్స్ అన్నీ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో బూస్ట్ అందించాయి. జైలర్ హిట్ తో తిరిగి ఫాం లోకి వచ్చిన రజిని ఈ ఇయర్ వేట్టయ్యన్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నారు. తర్వాత రజిని జైలర్ 2 ని చేస్తున్నాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ బర్త్ డేకి సినిమా ప్రకటించగా అభిమానులంతా ఈ సీక్వల్ పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు నెల్సన్. జైలర్ యాక్షన్ సీన్స్ కి సూపర్ క్రేజ్ రాగా పార్ట్ 2 లో అంతకుమించి ఫైట్ సీన్లు ఉండేలా చూసుకుంటున్నాడు.

Read Also:Donald Trump On Tiktalk: టిక్‌టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?

అంతేకాదు ఈసారి గ్లామర్ పరంగా కూడా ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జైలర్ 2 లో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టిని కూడా సెలక్ట్ చేశారు. కేజీఎఫ్ 1, 2 సినిమాల తర్వాత శ్రీనిధికి వచ్చిన క్రేజ్ కు ఆమె చేస్తున్న సినిమాలకు అసలు సంబంధమే లేదు. హిట్ కొట్టాం కదా అని వచ్చిన ప్రతి సినిమా చేయాలని అనుకోవడం లేదు. అందుకే శ్రీనిధి ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటుంది. తెలుగు నుంచి ఎన్నో సినిమాల ఆఫర్లు రాగా అమ్మడు నానితో హిట్ 3, సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలు చేస్తుంది. ఇక కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ 2 చేస్తుంది. అమ్మడు చేస్తుందంటే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అన్నట్లే లెక్క అనిపించుకోవాలని ట్రై చేస్తుంది. సూపర్ హిట్ ఫ్రాంచైజీలో భాగం అవ్వడం కచ్చితంగా శ్రీనిధికి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. శ్రీనిధితో పాటు తమన్నా కూడా పార్ట్ 2 లో నటిస్తుందని తెలుస్తుంది. సో జైలర్ 2 యాక్షనే కాదు గ్లామర్ కూడా నెక్స్ట్ లెవెల్‎లో ఉండబోతుంది. జైలర్ 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Also:Manmohan Singh Funeral LIVE Updates: నేడే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. నిగమ్బోధ్ ఘాట్లో అంతిమ సంస్కారాలు.. లైవ్ అప్డేట్స్!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *