విషాదం: స్టార్ హీరోకి మాతృవియోగం ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరోజా సంజీవ్.. ఈరోజు ఉదయం తన తుదిశ్వాస విడిచారు.

సరోజా సంజీవ్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సుదీప్‌ ను పరామర్శించి ఓదార్చారు. సరోజా సంజీవ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మరోవైపు కిచ్చా సుదీప్ అభిమానులు సైతం సంతాపం తెలియజేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున సరోజా సంజీవ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

The post విషాదం: స్టార్ హీరోకి మాతృవియోగం ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *