టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా “కింగ్ డమ్” తో మాస్ లుక్ లో అలరించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. గతంలో “గీత గోవిందం” చిత్రానికి కలిసి పని చేసిన విజయ్ – పరుశురామ్ కాంబినేషన్ లో వచ్చిన “ఫ్యామిలీ స్టార్” మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ఈసారి విజయ్ పూర్తి మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఫిబ్రవరి 12న విడుదలైన కింగ్ డమ్ టీజర్ లో అతని రఫ్ & రగ్గ్డ్ లుక్, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
రష్మిక మండన్నా ఈ టీజర్ చూసి విజయ్ను ప్రశంసలతో ముంచెత్తింది. “ప్రతి సినిమాతో కొత్త తరహా కథలు ఎంచుకుని, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తున్నావు. నిన్ను చూసి గర్వంగా ఉంది!” అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అవ్వగా, విజయ్ తనదైన శైలిలో స్పందించాడు. రష్మికను “రుషీ” అని పిలుస్తూ రిప్లై ఇచ్చాడు. వీరి అనుబంధంపై అభిమానులు తెగ స్పందిస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌కు తెలుగు వెర్షన్లో జూనియర్ ఎన్టీఆర్, తమిళ్‌కు సూర్య, హిందీ వెర్షన్‌కు రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు, ఇది సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. యుద్ధ నేపథ్యంతో నడిచే ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. విజయ్ కెరీర్లో మరో బిగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.