టాలీవుడ్ యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’ లాస్ట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా రెడీ చేస్తు్న్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో మనముందుకు వస్తున్నాడు. ‘దిల్‌రూబా’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను విశ్వ కరుణ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
తాజాగా ఈ ‘దిల్‌రూబా’ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం యూత్‌ను ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. హీరో జీవితంలో ప్రేమ, బాధ.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు. యూత్‌ఫుల్ రొమాంటిక్ కథతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్, ఎమోషన్ ఇందులో పుష్కలంగా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. కిరణ్ అబ్బవరం మరోసారి సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిరణ్-రుక్సర్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post రొమాంటిక్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ‘దిల్‌రూబా’ టీజర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.