
సెలబ్రిటీలు తమ ఆదాయం పెంచుకోవడానికి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించడం సాధారణమే. కానీ, ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్లను ప్రమోట్ చేయడంపై ప్రజల్లో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా, ఆల్కహాల్ (alcohol) వంటి ఉత్పత్తులకు ప్రముఖులు ప్రచారం చేయడం వల్ల సమాజంపై చెడు ప్రభావం పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో ఈ అంశంపై పెద్ద చర్చే జరిగింది.
ఇటీవల అలాంటి ఓ వివాదంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) చిక్కుకున్నారు. ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ (Adipurush) సినిమాలో సీతగా నటించిన ఆమె, ఇప్పుడు ప్రముఖ వోడ్కా బ్రాండ్ మ్యాజిక్ మూమెంట్స్ (Magic Moments) కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. కంపెనీ ప్రకటన ప్రకారం, “కృతి తెలివైనది, స్టైలిష్ గా ఉంటుంది. ఆమెతో భాగస్వామ్యం మా బ్రాండ్‌కు కొత్త ఊపునిస్తుంది,” అని పేర్కొన్నారు.
కృతి కూడా ఈ భాగస్వామ్యంపై ఆనందం వ్యక్తం చేస్తూ, “మ్యాజిక్ మూమెంట్స్ అనేది మంచి అనుభూతుల సంకేతం. ఈ కుటుంబంలో చేరడం ఉత్సాహంగా ఉంది,” అంటూ స్పందించారు. అయితే ఇది నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఒకవైపు పౌరాణిక పాత్రలో నటించి, మరోవైపు మద్యం బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం తగదని వారు మండిపడుతున్నారు.
ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేయడంలో సెలబ్రిటీల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. సామాజిక బాధ్యతపై సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.