సుబిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘లగ్గం’ చిత్రం ఓటీటీలో విడుదలై పది రోజులు అవుతున్నా సందడి తగ్గలేదని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. రెండు మనసులు ముడి పడడమే “లగ్గం” అంటే.. అనే థీమ్‌తో వచ్చిన ఈ చిత్రం ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తమ పెళ్లి క్యాసెట్ చూసుకున్నంత మురిపెంగా, సంబరంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తున్నారని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా చూసి ఎమోషనల్ అయ్యామంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో చెప్పిన ప్రతి తెలుగింటి కథ “లగ్గం”.. అంటూ నీరాజనాలు పడుతున్నారు. OTTలో ‘లగ్గం’ హిట్ అయిన సందర్బంగా చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకున్నారు. బుధవారం రోజున రామానాయుడు స్టూడియోలో ఈ సెలబ్రేషన్స్ వేడుక నిర్వహించారు.
నటకిరిటి రాజేంద్రప్రసాద్, చిత్ర రచయిత-దర్శకుడు రమేశ్ చెప్పాల, చరణ్ అర్జున్, ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి, రచ్చ రవి, వడ్లమాని, వివా రెడ్డి తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘లగ్గం సినిమా నాకు దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇంకా చూడని వాళ్ళు అమెజాన్, ఆహాలో తప్పకుండా చూడండి.’ అని అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న లగ్గం చిత్రం ఓటీటిలో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉండడం సంతోషంగా ఉంది.’ అని అన్నారు.
The post ఓటీటీలో “లగ్గం” మూవీకి సాలిడ్ రెస్పాన్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.