
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా, థియేటర్లలో మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. కామెడీ-యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కనిపించటం హైలైట్‌గా మారింది. కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. రిలీజ్ తరువాత రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
ఇక, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట మార్చి 7న రిలీజ్ అవుతుందని ఊహాగానాలు వచ్చినా, చివరికి రెండు రోజుల ఆలస్యంగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. విశ్వక్ అమ్మాయి పాత్రలో కనిపించేందుకు కష్టపడినా, కథలో అసభ్యత ఎక్కువగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ఓ కొత్త కామెడీ మూవీ చేస్తోన్నాడు. లైలా ఓటీటీలో ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.