- కుటుంబంలో పెను వివాదం
- మంచు లక్ష్మి ‘శాంతి’ మంత్రం
- ఇంస్టాగ్రామ్ లో తన కుమార్తె వీడియో షేర్ చేసి శాంతి అంటూ క్యాప్షన్
మంచు కుటుంబ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ సహా మంచు విష్ణు కూడా ఎవరి వెర్షన్లు వాళ్ళు పలు మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మీ మాత్రమే ఈ విషయం మీద స్పందించలేదు. వివాదం జరుగుతున్న ఒకరోజు మంచు మోహన్ బాబు నివాసానికి వచ్చి ఆమె వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఒకపక్క తన తండ్రి సోదరులు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం ఏర్పడితే మంచు లక్ష్మి మాత్రం శాంతి మాత్రం జపిస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో తన కుమార్తె వీడియో షేర్ చేసి శాంతి అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది.
Manchu Manoj: రాచకొండ సిపి ముందు మంచు మనోజ్ బైండోవర్!
తన తండ్రి, ఇద్దరు సోదరుల మధ్య ఏర్పడిన వివాదం రచ్చకెక్కి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది పంచాయితీ. తండ్రి మోహన్ బాబు మీద సోదరులు మంచు మనోజ్ మంచు విష్ణు ఇద్దరి మీద పోలీస్ కేసులు నమోదయ్యాయి. అయినా సరే మంచు లక్ష్మి చాలా కూల్ గా రియాక్ట్ అవుతున్నారు శాంతి అంటూ తన సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టడం ప్రస్తుతానికి హాట్ టాపిక్ అవుతుంది. మంచు లక్ష్మి నిజానికి గత కొంతకాలం నుంచి హైదరాబాదులో ఉండడం లేదు. ఆమె ముంబై మక్కా మార్చేసి బాలీవుడ్ లో సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ వస్తోంది. గొడవలు మొదలైన తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతానికి ఆమె హైదరాబాదులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి అనారోగ్యం పాలయ హాస్పిటల్ పాలు అవ్వడంతో మంచు లక్ష్మి ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది.