Prema Charitra Krishna Vijayam : సూపర్ స్టార్ చివరి చిత్రం “ప్రేమచరిత్ర – కృష్ణవిజయం” రిలీజ్ డేట్ ఫిక్స్

  • కృష్ణ చివరి చిత్రం “ప్రేమచరిత్ర – కృష్ణవిజయం”
  • ప్రధాన పాత్రల్లో యశ్వంత్-సుహాసిని
  • జనవరి 3న సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల

Supar Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ చివరి చిత్రం “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం”. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హెచ్. మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రంలో యశ్వంత్-సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, నాగబాబు, అలీ ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. జనవరి 3న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

“ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం” కృష్ణ చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని.. కృష్ణని ఆరాధించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్ పేరు సైతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు.

Read Also:Thandel : తండేల్ రెండో సింగిల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్

దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ.. “సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని మధుసూదన్ ఆకాంక్షించారు.

కన్నడలో ఇప్పటివరకు మధుసూదన్ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తను డైరెక్టర్ మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తన సినిమాలకు మాత్రమే కాకుండా వేరే సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంటారు. తెలుగు – కన్నడ భాషల్లో “నా కూతురు లవ్ స్టొరీ” పేరుతో ఒక భావోద్వేగ భరిత ఇంటెన్స్ లవ్ స్టొరీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read Also:India-Pakistan: అణు స్థావరాల వివరాలు మార్పిడి చేసుకున్న దయాది దేశాలు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *