Published on Oct 24, 2024 12:04 PM IST
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “దేవర” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా ఇది కావడంతో భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ సినిమా మిక్స్డ్ టాక్ లో కూడా 500 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది.
ఇక ఇప్పటికీ డీసెంట్ హోల్డ్ లోనే ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ నంబర్స్ అయితే సెట్ చేసింది. ఇక ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కి ముందే అంత త్వరగా అయితే ఓటిటిలో రాదని మేకర్స్ తేల్చేసారు. అలా సౌత్ భాషల్లో నవంబర్ 8న సినిమా వస్తున్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది.
అయితే ఇపుడు హిందీ రిలీజ్ పై కూడా లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీనితో దేవర హిందీలో నవంబర్ 22 నుంచి అందుబాటులో ఉండనుందట. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ డేట్స్ లో రానున్నట్టుగా లేటెస్ట్ టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.