SSMB29: మహేష్, రాజమౌళి భారీ ప్రాజెక్ట్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

అయితే దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మధ్య ఈ సినిమా విడుదల ఏకంగా 2028 లో ఉంటుంది అంటూ పలు ఊహాగానాలు కూడా కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా ఓ ఏడాది ముందే అంటే 2027లోనే విడుదలకి రావచ్చని తెలుస్తోంది. ఇది మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి కొంచెం ఊరట కలిగించే విషయం అని చెప్పొచ్చు. మరి ప్రపంచాన్ని షేక్ చేసే ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

The post SSMB29: మహేష్, రాజమౌళి భారీ ప్రాజెక్ట్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *