క్లారిటీ వస్తేనే మోక్షజ్ఞతో సినిమా ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 22, 2024 10:00 AM IST

నటసింహం బాలయ్య బాబు వారసుడు ‘నందమూరి మోక్షజ్ఞ’ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఓపెనింగ్ అనేది అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై చాలా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా పై వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైనవి.. వాటిలో ఎలాంటి నిజం లేదు అని.. ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే తామే సరైన సమయంలో చెబుతామంటూ చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

ఐతే, ఈ సినిమా ఓపెనింగ్ పోస్ట్ ఫోన్ అవ్వడానికి అసలు కారణం ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ తో పాటు షేర్ అని తెలుస్తోంది. సినిమాగానూ ప్రశాంత్ వర్మ 15 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు 20% షేర్ కూడా అడిగినట్టు సినీ వర్గాల టాక్. ఈ డీల్ కి నిర్మాతల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రస్తుతానికి సినిమా పోస్ట్ ఫోన్ అయింది. మరి రానున్న రోజుల్లో అయినా క్లారిటీ వస్తోందా ?, క్లారిటీ వస్తేనే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *