లేటెస్ట్: అదిరే పోస్టర్ తో “గేమ్ ఛేంజర్” టీజర్ అప్డేట్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎన్నో ఏళ్ళు నుంచి తెరకెక్కించారు కానీ ఇప్పుడుకొచ్చి టీజర్ అయితే ఇంకా రాలేదు. దీనితో ఈ టీజర్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ మేకర్స్ మాత్రం ఆల్రెడీ రెండు సాంగ్స్ ఇచ్చి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. ఇక టీజర్ లేదా నెక్స్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి అయితే మేకర్స్ ఇపుడు అప్డేట్ ని ఇచ్చేసారు. లేటెస్ట్ అప్డేట్ తో ఈ సినిమా తాలూకా టీజర్ ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అలాగే చరణ్ పై అదిరే పోస్టర్ ని కూడా లుక్ రివీల్ చేయకుండా రిలీజ్ చేశారు.

మరి ఇందులో చరణ్ కలెక్టర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే తనకి ఎదురుగా చాలా మంది పరిగెత్తుకుని రావడం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఫ్యాన్స్ కి కావాల్సిన అప్డేట్స్ తో ట్రీట్ ని మేకర్స్ అందిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, రవిబాబు తదితరులు నటిస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా రానున్న జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

The post లేటెస్ట్: అదిరే పోస్టర్ తో “గేమ్ ఛేంజర్” టీజర్ అప్డేట్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *