Published on Dec 29, 2024 8:59 AM IST
దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. మొత్తానికి ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారని.. ఫస్ట్ వెర్షన్ డైలాగ్ పార్ట్ ని ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను మహేష్ సరసన తీసుకోబోతున్నారని రీసెంట్ గా టాక్ నడిచింది. అన్నట్టు ఈ సినిమాలో ‘థోర్’ ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీమణులు కూడా నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల పై ఇప్పటివరకు టీం అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన పుస్తకాల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశారు. కాబట్టి, ఈ సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.