Published on Dec 8, 2024 8:43 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ ఇపుడు ఏ రేంజ్ లో ఇండియా వైడ్ గా రూల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ అనూహ్యంగా స్పెషల్ ప్రీమియర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఇది అనుకోని విధంగా ఒక విషాదంతో మొదలు కావాల్సి వచ్చింది. ప్రముఖ సింగిల్ స్క్రీన్ సంధ్య 70 ఎం ఎం దగ్గర జరిగిన తొక్కిసిలాటలో జరిగిన తీవ్ర విషాదంతో హీరో అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో బాధితులు కేసు కూడా వేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై లేటెస్ట్ అప్డేట్ ఇపుడు బయటకి వచ్చింది.
దీని ప్రకారం సంధ్య థియేటర్ ఓనర్ సహా మేనేజర్ ని లేటెస్ట్ గా పోలీసులు అరెస్ట్ చేశారట. అలాగే ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని సెక్యూరిటీ మేనేజర్ ని కూడా వారు అదుపులోకి తీసుకున్నారట. ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి రేమండ్ కి పంపారట. మరి ఈ అంశంపైనే చిక్కడపల్లి ఏసీపీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు.