మహేష్‌ను రాముడిగా చూపెట్టనున్న రాజమౌళి..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 8, 2024 9:00 AM IST

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రాజమౌళి.. ఆఫ్రికా దేశాల్లో లొకేషన్లను కూడా వెతికి వచ్చాడు. కాగా ఏప్రిల్ మూడో వారం త‌ర్వాత ఈ సినిమా రెగ్యల‌ర్ షూటింగ్ కి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా రాజ‌మౌళి అండ్ కో ప‌నిచేస్తోందని తెలుస్తోంది. జనవరి నుంచి వ‌ర్క్ షాపులు నిర్వ‌హిస్తారట.

అన్నట్టు ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపించాయి. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌, ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *