
టాలీవుడ్‌లో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. టీవీ9 ఇంటర్వ్యూలో లావణ్య భావోద్వేగంగా మాట్లాడుతూ, కన్నీళ్లు పెట్టుకుంది, క్షమాపణలు చెప్పింది. తన జీవితంలో జరిగిన అన్యాయం, భయంతో గడిపే రోజుల గురించి నిర్భయంగా చెప్పుకొచ్చింది. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, “ప్రతి క్షణం భయంతో బ్రతుకుతున్నాను” అని తెలిపింది.
ఇంటర్వ్యూలో లావణ్య మస్తాన్ సాయి గురించి తీవ్ర ఆరోపణలు చేసింది. “పదుల సంఖ్యలో అమ్మాయిలను రికార్డ్ చేశాడు, వారి జీవితాలతో ఆడుకున్నాడు” అంటూ ధ్వజమెత్తింది. తాను కూడా అతనివల్ల బలవంతంగా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, “ఏ క్షణంలోనైనా నన్ను చంపేయొచ్చు” అని చెప్పడం గమనార్హం. సొసైటీ నుంచి సపోర్ట్ లేకపోయినా, తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది.
ఇంటర్వ్యూలో లావణ్య రాజ్ తరుణ్ గురించి కూడా మాట్లాడింది. అతడితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ “నా జీవితాన్ని కోల్పోయాను, నా మనిషిని కోల్పోయాను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాను రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని చెప్పడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
తన వీడియోల గురించి క్లారిటీ ఇస్తూ “నేను ఏ వీడియోలు రిలీజ్ చేయలేదు. నాకు జరిగిన అన్యాయం మరొక అమ్మాయికి జరగకూడదనేదే నా తాపత్రయం” అని లావణ్య పేర్కొంది. తాను రాజ్ తరుణ్‌తో చాలా సంతోషంగా ఉండేదానిని, కానీ మస్తాన్ సాయి వల్లే మా మధ్య గొడవలు వచ్చాయని వెల్లడించింది.