హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ.. “నాకు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. కరోనా టైమ్‌లో పాడ్ కాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయడం సులభంగా అనిపించింది. ఇంత వరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు.” అని అన్నారు.రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నామని చెప్పారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. డిసెంబర్ 27 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.ఇక దర్శకుడు రవి మాట్లాడుతూ.. “వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపించింది. అరుదైన సబ్జెక్టు. మా సినిమాను మీడియాతో పాటు ప్రేక్షకులు ఆదరించాలి.” అని కోరారు.