మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్నాని, సుస్మిత అనాల, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్-కామెడీ ఎంటర్‌టైనర్ “లోపలికి రా చెప్తా” చిత్రానికి సంబంధించిన మొదటి పాటను నేడు విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో హక్కులు ప్రముఖ సరిగమ మ్యూజిక్ కంపెనీ సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ, “మా చిత్ర కథానాయకుడి పాత్ర డెలివరీ బాయ్ నేపథ్యంలో ఉండటంతో, మొదటి పాటను ఓ డెలివరీ బాయ్ ద్వారా ఆవిష్కరించేందుకు నిర్ణయించాం. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు డేవ్ జాండ్ కంపోజ్ చేయగా, కపిల్ కపిలన్ పాడారు” అని తెలిపారు. సినిమా విడుదల ఫిబ్రవరిలో ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఈ చిత్రంలో కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్నాని, సుస్మిత అనాల, సాంచిరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాండ్, సినిమాటోగ్రఫీ రేవంత్ లేవాక, అరవింద్ గణేష్, ఎడిటర్ వంశీ, పిఆర్ ఓ బి. వీరబాబు తదితరులు పనిచేశారు. లక్ష్మీ గణేష్ చేడెళ్ళ, కొండా వెంకట రాజేంద్ర నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.