మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా, పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఆడియెన్స్‌ని థ్రిల్ చేసింది. ఇక ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లా్ట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు ఓటీటీలోని సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చిన దగ్గర్నుండి టాప్ ప్లేస్‌లో దూసుకుపోతుంది. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా కూడా వెల్లడించింది. లక్కీ భాస్కర్ చిత్రం 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచిందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
కాగా, ‘లక్కీ భాస్కర్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చే వరకు ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఇప్పుడు టాప్-3లో దేవర కొనసాగుతుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.
The post 15 దేశాల్లో ‘లక్కీ భాస్కర్’ దూకుడు! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.