
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన “లక్కీ భాస్కర్” సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించి, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం, 2024 అక్టోబర్ 31న విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణను పొందింది. భారీ వసూళ్లను రాబట్టి, దుల్కర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
తాజాగా, ఈ సినిమా Netflix లో వరుసగా 13 వారాలపాటు ట్రెండింగ్‌లో నిలిచి, దక్షిణ భారతీయ చిత్రాలలో ఈ రికార్డు సాధించిన మొదటి సినిమా గా నిలిచింది. కట్టిపడేసే కథ, బలమైన స్క్రీన్‌ప్లే, దుల్కర్ నటన, టాప్-నాచ్ టెక్నికల్ వర్క్ ఈ చిత్రాన్ని విజయవంతం చేశాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలం ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ తన ఇన్టెన్స్ పెర్ఫార్మెన్స్ తో భాస్కర్ పాత్రకు న్యాయం చేశారు.
Netflix లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుంచి “లక్కీ భాస్కర్” టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొదటి వారం itself 15 దేశాల్లో టాప్ 10 లో చోటు దక్కించుకుంది. అదనంగా, 17.8 బిలియన్ నిమిషాల వీక్షణలు సాధించి, రెండు వారాలపాటు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో నిలిచింది.
ఈ విజయంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇంకా ఈ సినిమా చూడని వారు వెంటనే Netflix లో వీక్షించి, భాస్కర్ అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.