MAD Sequel Promises More Fun
MAD Sequel Promises More Fun

బ్లాక్‌బస్టర్ హిట్ ‘మ్యాడ్’ సీక్వెల్‌గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Narne Nithiin, Sangeeth Shobhan, Ram Nithiin, Vishnu Oi ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు Kalyan Shankar దర్శకత్వం వహిస్తున్నారు. Sitara Entertainments, Fortune Four Cinemas, Srikara Studios సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం March 29, 2025న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన MAD 2 Teaser కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ ITC Kohinoor హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన మూవీ టీమ్, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. Narne Nithiin మాట్లాడుతూ, “మ్యాడ్-1కు అద్భుత స్పందన వచ్చింది. కానీ మ్యాడ్-2 దానిని మించి ఉంటుందని గ్యారంటీ” అన్నారు. అలాగే Ram Nithiin మాట్లాడుతూ, “మా మొదటి సినిమాకు వచ్చిన ఆదరణ మాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ సీక్వెల్ కూడా మిమ్మల్ని నిరాశపరచదు” అని తెలిపారు.

సినిమా Music Director Bheems Ceciroleo మాట్లాడుతూ, “మ్యాడ్ సంగీతాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, మ్యాడ్ స్క్వేర్ కూడా అంతకుమించి ఉంటుంది” అని చెప్పారు. “హీరోలందరూ భవిష్యత్తులో పెద్ద స్టార్స్ అవుతారు” అంటూ బీమ్‌స్ భావ వ్యక్తం చేశారు.

మార్చి 29న థియేటర్లలో సందడి చేయనున్న MAD Square, హాస్యం, వినోదం, అనూహ్య ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమవుతోంది.

By admin