
తాజాగా ‘అమరన్’ మూవీతో భారీ హిట్ అందుకున్న తమిళ హీరో శివకార్తికేయన్, మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సుప్రసిద్ధ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్న ‘ఎస్కే 23’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అధికారికంగా ‘మదరాసి’ అనే టైటిల్‌ను పొందింది. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఓ పవర్ఫుల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
SK 23 Official Title Madarasi Released
ఈ గ్లింప్స్‌లో శివకార్తికేయన్ పూర్తిగా కొత్త లుక్‌లో, ఇంతకుముందెప్పుడూ చూడని భీకరమైన మాస్ అవతార్‌లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ టీజర్‌తో సినిమా స్థాయిని మరో లెవల్‌కి తీసుకెళ్లారు మేకర్స్.
‘మదరాసి’ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, యాక్షన్ స్టార్స్ విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ, శివకార్తికేయన్ కెరీర్లో మరో భారీ మాస్ ఎంటర్టైనర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.