ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం కోసం యావత్తు ప్రపంచ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు నుంచో ఒక అందని ద్రాక్ష గానే ఉంది.
ఎన్నో ఏళ్ళు నుంచి అనుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకి టేకాఫ్ అయ్యింది. ఇక నిన్ననే సినిమా సైలెంట్ గా ముహూర్త కార్యక్రమాలు కూడా జరుపుకోగా ఈ సందర్భంలో మహేష్ బాబు రాజమౌళితో సినిమా కోసం చేసిన ఓ పాత ట్వీట్ వైరల్ గా మారింది. అది 2010 సంవత్సరం మే 22న మహేష్ బాబు రాజమౌళితో సినిమా కోసం ఎగ్జైట్ అవుతూ అందరికీ అప్డేట్ అందించారు.
నిజంగా ఓ గుడ్ న్యూస్ నేను రాజమౌళి సినిమా చేయబోతున్నాం మొత్తానికి ఇద్దరం కలిసి ఫైనల్ గా వర్క్ చేస్తున్నాం అంటూ చేసిన పోస్ట్ ని ఫ్యాన్స్ వెతికి మరీ ఇపుడు హైలైట్ చేస్తూ ప్రస్తుత సందర్భానికి లింక్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ కలయికలో ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాల్సిందే.
4 all u people there's sum really good news:)looks like Rajamouli n Me r finally working together:)FINALLY
— Mahesh Babu (@urstrulyMahesh) May 22, 2010
The post రాజమౌళితో ప్రాజెక్ట్.. మహేష్ 14ఏళ్ల కితం ట్వీట్ వైరల్..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.