
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం మహేష్ బాబు పూర్తి మేకోవర్ చేసుకున్నారు. లాంగ్ హెయిర్, కొత్త లుక్, పవర్ఫుల్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో మహేష్ బాబు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కథ, మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ లుక్‌ను గోప్యంగా ఉంచడం వల్ల ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్సైట్మెంట్ నెలకొంటోంది.
ఇటీవల మహేష్ బాబు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్, కండలు తిరిగిన శరీరంతో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు “సింహం సిద్ధమవుతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి సినిమాలోని పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం మహేష్ శరీరాకృతిని మార్చుకుని, గట్టి శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ సినిమాతో మహేష్ బాబు తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, మహేష్ బాబు కృషి కలిసివస్తే ఇండియన్ సినిమాకే కొత్త రికార్డులు సెట్ అవుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. SSMB 29 ఖచ్చితంగా ఒక విజువల్ వండర్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.