SSMB29 : రాజమౌళి సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా..నిజమా ?

  • రాజమౌళి మహేష్ సినిమా గ్రాండ్ లాంచ్
  • రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తున్న మహేష్
  • లాభాల్లో వాటా తీసుకోనున్న ప్రిన్స్, రాజమౌళి

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రం ‘SSMB29’. ఈ రోజు అట్టహాసంగా లాంచ్ కాబోతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో మహేష్ కనిపించబోతున్నారు. ఇప్పటికే లొకేషన్లు కూడా రాజమౌళి ఫైనల్ చేసినట్లు సమాచారం. జక్కన్న రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారు. రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని ఆయన సిద్ధం చేయబోతున్నారట. ప్రొడక్షన్ లోకి వెళ్లిన తర్వాత ఇంకా బడ్జెట్ పెరుగుందని కూడా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భాగం కాబోతుందని సమాచారం.

Read Also:Chinmoy Krishna Das: హిందూ సన్యాసి చిన్మోయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు..

అది ఏంటో తెలియాలంటే మరి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ సినిమాను ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకుని వెళ్లడానికి రాజమౌళి వారిని రంగంలోకి దించారని అనుకుంటున్నారు. కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబుకి ఎంత రెమ్యునరేషన్ అయిన ఇవ్వడానికి అయిన నిర్మాత రెడీగా ఉన్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ రెండు భాగాలుగా కూడా అస్సలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేయబోతున్నారట. రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఈ సినిమా రెమ్యునరేషన్ బదులు లాభాల్లో వాటా తీసుకుంటానని మహేష్ బాబు చెప్పారని తెలుస్తోంది. రాజమౌళి కూడా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటానే తీసుకోబోతున్నారట. లాభాల్లో 25 శాతం వాటిని మహేష్ బాబు, రాజమౌళికి ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారని టాక్. దీంతో వీరి రెమ్యునరేషన్ కూడా మూవీ కోసమే ఖర్చు చేయబోతున్నారట.

Read Also:AP News: తనిఖీ చేస్తుండగా.. కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు!

ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోట్ చేయడానికి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ను కూడా ముందుకు వచ్చినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా ఇండియన్ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ అయిందట. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఫైనల్ చేసినట్లు టాక్.. భారీ పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ యాక్టర్లు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారట. ఇక ‘SSMB29’ మొదటి పార్ట్ 2027లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక రెండో భాగం 2029లో రిలీజ్ అవుతుందని సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *