స్పెషల్ డే రోజున ‘అతిథి’లా వస్తున్న మహేష్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 2, 2025 2:55 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రెస్టీజియస్ మూవీని జనవరి 2న లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో యావత్ ఇండియా ఈ సినిమా వైపు చూస్తుంది. ఇక ఈ సినిమాతో గ్లోబల్‌గా మహేష్-రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనున్నారనే టాక్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

అయితే, ప్రేమికులకు ఎంతో స్పెషల్ అయిన ప్రేమికుల రోజున మహేష్ బాబు నటించిన ఓ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మహేష్ బాబు, అమృతా రావు జంటగా తెరకెక్కిన మూవీ ‘అతిథి’ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రీ-రిలీజ్ కానుంది. 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఈ మూవీలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు.

దీంతో ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తుండటంతో ‘అతిథి’ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *