
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి మహేష్ మేనకోడలు జాహ్నవి స్వరూప్ హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని కుమార్తె అయిన జాహ్నవి, తన సరికొత్త లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల జాహ్నవి – సుధీర్ బాబు కుమారుడు చరిత్ కలిసి ఉన్న ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరూ అందంగా, స్టైలిష్‌గా కనిపించడంతో, జాహ్నవి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అంతేకాకుండా, జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె అద్భుతంగా కనిపించడంతో, అభిమానులు ఆమెను టాప్ హీరోయిన్‌లతో పోల్చడం ప్రారంభించారు.
జాహ్నవి తల్లి మంజుల ఘట్టమనేని, తెలుగులో చాలా సినిమాల్లో నటించి, నిర్మాతగా రాణించారు. ఆమె రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించింది. అంతేకాదు, పోకిరి సినిమా సహనిర్మాతగాను పనిచేశారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు – రాజమౌళి మూవీ చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు జాహ్నవి వైరల్ ఫోటోలు మరో కొత్త చర్చనీయాంశంగా మారాయి. జాహ్నవి త్వరలో హీరోయిన్గా వస్తుందా? టాలీవుడ్‌లో ఆమె ఎంట్రీపై మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మా అప్‌డేట్స్ కోసం వెయిట్ చేయండి.