పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన టీజర్ గురించి గతకొద్ది రోజులుగా పలు రకాల వార్తలు వస్తున్నాయి.
రాజా సాబ్ టీజర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని.. లేదా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా వస్తుందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందని.. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందని.. ఈ సినిమా టీజర్‌ను సరైన సమయంలో రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. టీజర్ రిలీజ్ విషయంలో తాము అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
దీంతో రాజా సాబ్ టీజర్‌పై వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
#TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swing
We’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh
— People Media Factory (@peoplemediafcy) December 18, 2024
The post ‘ది రాజా సాబ్’ టీజర్‌పై మేకర్స్ క్లారిటీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.