Malavika Mohanan reveals fun side of Prabhas on set

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “రాజా సాబ్” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఈ సినిమా ప్రభాస్ కొత్త జోనర్‌లో చేసిన ప్రయోగం. ఈసారి మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు నటించిన పాత్రలకు భిన్నంగా ఇది ఉండనుంది.

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్‌కు డెబ్యూట్ ఇస్తున్న మాళవిక ఇప్పటికే ప్రభాస్ గురించి పలు విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది. రాజాసాంగ్ షూటింగ్ సమయంలో ఆయన ఎటువంటి వ్యక్తి, ఫుడ్ పంపించే విధానం వంటి విషయాలు చాలా ఆసక్తికరంగా చెప్పింది. ఆమె మాటల్లో ప్రభాస్ నిజంగా “సైలెంట్ స్టార్” కాదు అనిపిస్తుంది.

సోషల్ మీడియా లైవ్‌ లో మాళవిక ఓ నెటిజన్ ప్రశ్నకు స్పందిస్తూ – “ప్రభాస్ ఇంటర్వ్యూలు చూస్తే సైలెంట్ పర్సన్ అనిపిస్తాడు, కానీ అతన్ని కలిసిన తర్వాత తెలిసింది – ఆయన చాలా ఫన్నీ, అందరినీ నవ్విస్తూ ఉంచే వ్యక్తి” అని చెప్పింది. అతని చుట్టూ ఎప్పుడూ positive vibe ఉండేదని మాళవిక చెప్పిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల హృదయాలను తాకాయి. “రాజా సాబ్” సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉండగా, మాళవిక కామెంట్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రభాస్ కొత్త అవతారాన్ని చూడాలనుకునే ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *