
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న “రాజాసాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ చేయని హారర్ కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మాళవికా మోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ప్రభాస్ గురించి అందరూ అనుకుంటారు ఇంట్రోవర్ట్ అని.. నేనూ మొదట్లో అలాగే అనుకున్నా. కానీ అతనిని దగ్గరగా చూస్తే అసలు అలా కాదు. సెట్లో ఆయన చాలా ఫన్నీగా, చిల్డిష్‌గా ఉంటారు. తన యూనిట్ మొత్తానికి ఫుడ్ తెప్పించి అందరినీ ముచ్చటగా చూసుకుంటారు. చాలా సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు” అని మాళవిక చెప్పింది.
ఈ కామెంట్లు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రభాస్ సాధారణంగా మీడియా ఎదుట చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. కానీ మాళవిక చెప్పిన విషయాలు చూస్తుంటే, సెట్లో ఆయన నిజంగా ఎంతో కేరింగ్ & ఫన్ పర్సనాలిటీ అని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం “రాజాసాబ్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్ రావొచ్చని టాక్ వినిపిస్తోంది.