దక్షిణ భారత సినిమా ప్రేమికులకు మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1992 ఆగస్టు 7న ముంబైలో జన్మించిన మాళవిక, బాలీవుడ్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ యూకే మోహనన్ కుమార్తె. ఆమె తల్లి వీణా మోహనన్. ప్రస్తుతం మాళవిక తన కుటుంబంతో కలిసి కేరళలోని బియ్యూర్ అనే ఊరిలో నివసిస్తున్నారు.

మాళవిక 2013లో “పట్టం పోలే” అనే మలయాళ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం రజనీకాంత్ హీరోగా వచ్చిన “పెట్టా”, విజయ్ సరసన నటించిన “మాస్టర్” (Master) సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన “తంగళాన్” (Thangalaan) చిత్రంలో విక్రమ్ సరసన ఆమె పోషించిన డిఫరెంట్ క్యారెక్టర్ మంచి మార్కులు కొట్టింది.

ఇప్పుడు మాళవిక టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న “రాజా సాబ్” (Raja Saab) అనే చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరగుతోంది. ఈ చిత్రం ఆమెకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెడుతుందా అనే ఆసక్తి సినిమా లవర్స్‌లో కనిపిస్తోంది.

ఇక సోషల్ మీడియాలోనూ మాళవిక చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలు, స్టైల్‌ఫుల్ లుక్స్‌తో (Stylish Looks) అభిమానులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. తాజాగా చీరకట్టులో (Saree Look) ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఎలా పెరుగుతుందో వేచి చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *