- మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..
- కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు వాసుదేవన్..
MT Vasudevan Nair: మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వయోభారం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో చికిత్స పొందుతున్నారు. అయితే, 1933 జూలై 15వ తేదీన వాసుదేవన్ పాలక్కాడ్ సమీపంలోని కడలూరులో పుట్టారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యంపై ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. ఆయన రచించిన ‘నాలుకెట్టు, అసురవిత్తు, మంజు, సర్పవిత్తు’ లాంటి మరిన్ని రచనలు పాఠకుల ఆదరణను సంపాదించుకున్నాయి.
Read Also: CWC meeting: నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
అయితే, కొంత కాలం పాటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఎంటీ వాసుదేవన్ నాయర్ ఆ తరువాత 1960వ దశాబ్దంలో మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 54 సినిమాలకు ఆయన స్ర్కీన్‌ప్లే అందించారు. అలాగే, పలు చిత్రాలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన నిర్మాల్యం, కడవు లాంటి మూవీస్ కు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చాయి. నాలుగు సార్లు వాసుదేవన్ ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. 1995లో ఎంటీ వాసుదేవన్ నాయర్ కు కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. 2005లో పద్మభూషణ్ తో సత్కరించింది.