నస్లెన్ కె గపూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా ఇప్పటికే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మలయాళం వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ఈ నెల 12వ తేదీ నుంచి ఆహాలో ప్రేమలు స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులోనూ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టిందీ సినిమా. ప్రేమలు సినిమాకు గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ఆహాలో యూత్ ఆడియెన్స్ బాగా చూసే అవకాశం ఉంది.