• మోహన్ బాబు ఇంటి వ్యవహారంపై ఎన్టీవీతో మాట్లాడిన CP సుధీర్
  • మోహన్ బాబు ఇంట్లో జరిగింది వాళ్ళ వ్యక్తిగతం
  • తనకు సమయం కావాలని పోలీసులకు విష్ణు రిక్వెస్ట్

మంచు ఫ్యామిలీ వివాదం గతకొద్ది రోజులగా హాట్ టాపిక్ మారింది. ఈ వివాదం పై హైదరాబాద్ సీపీ సుధీర్ బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదు చేయడం జరింగింది. వారి ఫ్యామిలీ ఇష్యూ వలన పబ్లిక్ డిస్ట్రబ్ అవుతున్నప్పుడు కమిషనరేట్ రూల్ ప్రకారం బైండోవర్ చేయచ్చు. మోహన్ బాబు ఇంట్లో జరిగింది వాళ్ళ వ్యక్తిగతం. జల్ పల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నందునే ముగ్గురికి నోటీసులు ఇచ్చాం.

Also Read : KeerthySuresh : కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి ఫోటోలు..

ఇప్పుడు మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతల్లో ఇక నుండి ఈ ప్రవైట్ వ్యక్తులు ఉండడానికి విల్లేదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేయమని పహాడీ షరీఫ్ పోలీస్ లకు సూచనలు చేసాం. నేరం చేస్తే ఎవరైనా సమానమే అందుకే సెలబ్రిటీ అయినా సరే బైండోవర్ చేసాం. తెలుగురాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్‌ మోహన్ బాబు ఫ్యామిలీపై నమోదయింది. మనోజ్ నోటీసులకు స్పందించి తమ ఎదుట హాజరైయ్యాడు. మనోజ్ ని సంవత్సరం పాటు బాండోవర్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం లోపల ఎలాంటి సంఘటన జరిగిన బాండోవర్ రద్దయిపోతుంది. నిన్న సాయంత్రం విష్ణు వచ్చి బాండోవర్ నోటీసు కి సమయం కావాలని కోరాడు. విష్ణు కి 24వ తేదీ వరకు సమయం ఇచ్చాము. ముగ్గురు కి చెందిన బౌన్సార్లు ఘర్షణ పడడం.. గొడవకు ప్రధాన కారణంవిఐపి లు బౌన్సార్లు వ్యక్తిగతంగా పెట్టుకోవాలా లేదా అనేదానిపై చర్చ నడుస్తుంది. మనోజ్‌ ఫిర్యాదు కేసులో మోహన్‌బాబు మేనేజర్‌ ను అరెస్ట్‌ చేసాం ‘అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *