- బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్
- జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దాడి చేసిన దుండగులు
- ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్
- ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి వచ్చిన మంచు మనోజ్.
Manchu Manoj: ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలికి గాయాలు కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. మంచు మనోజ్ నడవలేకుండా ఉన్నారు. విద్యానికేతన్ స్కూలుకు సంబంధించిన సిబ్బంది తనపై దాడి చేశారని మంచు మనోజ్ అంటున్నారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Home Minister Anitha: కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయి.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
మరోవైపు మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు తనను, తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు అనే వార్త టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా.. ఇప్పుడు పరస్పర దాడుల వరకు వెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబుకు చెందిన పీఆర్ టీమ్ స్పందించింది. మోహన్ బాబు, మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో అసలు నిజం లేదని తెలిపింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయని పీఆర్ టీమ్ పేర్కొంది. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని ప్రకటన విడుదల చేశారు. మరి ఈ కేసులో వాస్తవాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్‌పై దాడి జరగడం గమనార్హం.