
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన “మిరాయ్”, “వాట్ ది ఫిష్”, “భైరవం” వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సినిమా కెరీర్ పక్కన పెడితే, వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఆయన ఎంతో హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. 2023 మార్చి 3న, మనోజ్, భూమా మౌనికను హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
ఈ రోజు (మార్చి 3) మంచు మనోజ్ – మౌనిక వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా మనోజ్ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. “రెండేళ్ల క్రితం నేను అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నాను. నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయితో కొత్త ప్రయాణం ప్రారంభించాను. మౌనిక నా జీవితంలో అడుగుపెట్టిన క్షణం నుంచి నాకు తెలియని కొత్త ప్రేమ అందించావు. నా కష్టాల్లో నువ్వు నా గొంతుక, నా గందరగోళంలో ప్రశాంతత అయ్యావు. ప్రేమ, సంతోషం, నవ్వులతో మన ఇంటిని అందంగా తీర్చిదిద్దావు. ఈ రెండేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు, విజయాలు, పోరాటాలు ఎదుర్కొన్నా. కానీ వాటిలో ఒకటి మాత్రం మారలేదు… అదే మనం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నా అతిపెద్ద సపోర్టర్. ఈ ప్రేమకు జీవితాంతం కృతజ్ఞుడిని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మున్నీ!” అని మనోజ్ భావోద్వేగంగా రాశారు.
మౌనిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ, మనోజ్‌తో కలిసి దిగిన స్నేహభరితమైన, అందమైన ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.