Manchu Family : సంచలన లేఖ విడుదల చేసిన మంచు నిర్మల

మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో అయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేసారు.  ఆ లేఖలో నిర్మల ” డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయినవిష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు.దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు తెలిసింది.

నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు మరియు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసాడు, నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉన్నది.నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళు కూడా ‘మేమిక్కడ పని చేయలేమని’, వాళ్ళే మానేసారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. విష్ణు మా జలపల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీకు తెలియజేయుచున్నాను” అని పేర్కొన్నారు.

Manchu Nirmala

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *