- సీఎంతో మీటింగుకు ‘మా’ ప్రెసిడెంట్ గైర్హాజరు
- సమావేశానికి వెళ్లి ఉంటే బాగుండేదంటున్న విశ్లేషకులు
- ఆయన తరఫున హాజరైన శివబాలాజీ
Manchu Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిశారు. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ లో కీలక వ్యక్తి అయిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు.. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీ మోహన్ లాంటి సీనియర్ దర్శక నిర్మాతలు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు.. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సంస్థల నుంచి పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ అధ్యక్షుడైన హీరో విష్ణు మాత్రం హాజరు కాలేదు.
Read Also:OnePlus 12 Price Drop: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 12పై 12 వేల తగ్గింపు!
తెలుగు సినీ ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు, ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యల మీద సర్కారుతో టాలీవుడ్ పెద్దలు చర్చించారు. ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలని నిర్ణయించారు. టాలీవుడ్ కేంద్రమైన హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఇలాంటి కీలకమైన సమావేశంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఉంటే బాగుండేదని అంటున్నారు. రేవంత్ రెడ్డితో మీటింగ్ కి మంచు విష్ణు ఎందుకు రాలేదో కారణాలు తెలియదు. ఆయన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారా? లేదా ప్రస్తుతం ఇండియాలో లేరా? ఉన్నా మీటింగ్ రాలేకపోయారా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే తాను రాలేకపోతున్నందునే మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ తరపున నటుడు శివ బాలాజీని పంపించి ఉంటారని సమాచారం. శివ బాలాజీ ప్రస్తుతం ‘మా’ ట్రెజరర్ గా కొనసాగుతున్నారు. కాబట్టి విష్ణు రాలేని కారణంగా అసోషియేషన్ నుంచి ఆయన వచ్చి ఉంటారని తెలుస్తోంది. సీఎంతో సమావేశానికి రానప్పటికీ సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Also:Kamareddy: మిస్టరీగా ఎస్.ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతి కేసు.. కీలకంగా మారిన కాల్ డేటా..